News August 27, 2025
వరంగల్: WOW.. కనురెప్పపై సూక్ష్మ గణపతి

వరంగల్ నగరానికి చెందిన సూక్ష్మ కళాకారుడు మట్టేవాడ అజయ్ కుమార్ కనురెప్పపై సూక్ష్మ గణపతిని రూపొందించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని 120 గంటల పాటు శ్రమించి 0.37మి.మీ ఎత్తులో గణనాథున్ని తయారుచేశారు. అజయ్ కుమార్ అనేక సూక్ష్మ కళాఖండాలను రూపొందించి అనేక అవార్డులు సాధించారు. ప్రత్యేకమైన సూక్ష్మ కళారూపాలను రూపొందిస్తూ అయన ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నారు.
Similar News
News August 27, 2025
MBNR: పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్.. ఫోన్ చేయండి

అరుణాచలం గిరి ప్రదక్షిణకు MBNR డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుజాత Way2Newsతో తెలిపారు. Sep 5న రాత్రి 7గం.కు బస్ MBNR నుంచి బయలుదేరుతుందని, 6న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం చేరుకొని అరుణాచలం గిరిప్రదక్షిణ, 8న MBNRకు చేరుకుంటుందన్నారు. ఒక్కొక్కరికి రూ.3,600 (ప్యాకేజ్) టికెట్ ధర ఉందన్నారు. వివరాలకు 99592 26286, 94411 62588 ఫోన్ చేయాలన్నారు.Web:https://tsrtconline.in
News August 27, 2025
TCS కొత్త ఆఫీస్ అద్దె రూ.2,130 కోట్లు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) బెంగళూరులో కొత్త క్యాంపస్ ప్రారంభించనుంది. ఇందుకు బెంగళూరులోని 360 బిజినెస్ పార్క్ టవర్స్ యాజమాన్యంతో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. 14 లక్షల చదరపు అడుగుల కార్యాలయానికి 15 ఏళ్లకుగానూ రూ.2,130 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. నెలకు రూ.9.31 కోట్ల అద్దెతో రూ.112 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేసింది. ప్రతి మూడేళ్లకూ 12 శాతం అద్దె పెంపు ఉండనుంది.
News August 27, 2025
VJA: ఎఫ్ఎం రేడియో నుంచి త్వరలో ట్రాఫిక్ అప్డేట్స్

విజయవాడ ప్రజలకు త్వరలో ఎఫ్ఎం రేడియో స్టేషన్‌లో ట్రాఫిక్ అప్డేట్స్ రాబోతున్నాయి. నగర పరిధిలో ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళ ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఎం రేడియోలో ట్రాఫిక్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా వాహనదారుల ప్రయాణం సులభంగా, వేగవంతంగా జరుగుతుందన్నారు. ఎఫ్ఎం ఆన్ చేసుకుంటే మీరు భద్రంగా మీ ఇంటికి చేరవచ్చని అధికారులు అంటున్నారు.