News August 27, 2025
ఆ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: ఆర్టీసీ ఎండీ

AP: ఆర్టీసీకి త్వరలోనే 1,500 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు రానున్నాయని ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. స్త్రీ శక్తి పథకం ద్వారా వాటిలోనూ ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. ఈ పథకం అమలు చేస్తున్న పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదన్నారు. స్త్రీ శక్తి కారణంగా పాత రూట్లు రద్దు చేసే ఆలోచన లేదని, అవసరమైతే డిమాండ్‌ను బట్టి మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
Similar News
News August 27, 2025
ఖైరతాబాద్ మహాగణపతి ముందే మహిళ ప్రసవం

TG: వినాయక చవితి రోజు ఖైరతాబాద్ మహా గణపతి వద్ద అద్భుతం చోటు చేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన నిండు గర్భిణి రేష్మ దర్శనం కోసం క్యూ లైన్‌లో నిల్చున్న సమయంలో పాపకు జన్మనిచ్చింది. గమనించిన సిబ్బంది పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తల్లీబిడ్డలను తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగా ఉన్నారు. గణనాథుడి ముందే పుట్టిన ఆ చిన్నారిది ఎంతో అదృష్టమని భక్తులు తెలిపారు.
News August 27, 2025
IPLకు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్

భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ IPLకు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘IPL ప్లేయర్‌గా నా ప్రయాణం ఇవాళ ముగిసింది. కానీ వివిధ లీగుల్లో గేమ్ ఎక్స్‌ప్లోరర్‌గా నా సమయం మొదలైంది. ఇంతకాలం వండర్‌ఫుల్ మెమొరీస్ మిగిల్చిన అన్ని ఫ్రాంచైజీలు, IPL, BCCIకి థాంక్స్. భవిష్యత్‌ను ఆస్వాదించేందుకు వేచి చూస్తున్నా’ అని అశ్విన్ ట్వీట్ చేశారు. కాగా ఈ ఏడాది అతడు చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే.
News August 27, 2025
BIG ALERT: ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్

తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి.