News August 27, 2025
తాంసి : అధిక మద్యం తాగి మృతి

తాంసి మండలంలోని గొట్కూరిలో మద్యం మత్తు విషాదంగా మారింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. మడావి లక్ష్మణ్(48) సోమవారం రాత్రి స్నేహితులతో అధిక మద్యం తాగాడు. ఇంటికి వచ్చిన ఆయన అపస్మారక స్థితిలో పడిపోగా కుటుంబీకులు రిమ్స్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందడంతో ఇంటికి వచ్చారు. మంగళవారం కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
Similar News
News August 27, 2025
భీంపూర్‌లో అత్యధిక వర్షపాతం

గడిచిన 24 గంటల్లో జిల్లాలోని భీంపూర్ మండలంలో అత్యధికంగా 26.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జైనథ్‌లో 20.5 మి.మీ, సాత్నాలో 19.3 మి.మీ. వర్షపాతం రికార్డయింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రైతులు రెండు రోజుల పాటు పంటలకు మందులు పిచికారీ చేయకుండా ఉండాలని వ్యవసాయ అధికారులు తెలిపారు.
News August 27, 2025
600 మంది సిబ్బంది.. 400 సీసీ కెమెరాలు: ADB SP

గణపతి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రధాన పట్టణాలలో క్లస్టర్లు, సెక్టర్లు వారీగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 3 షిఫ్టుల్లో నిరంతరం గస్తీతో పర్యవేక్షిస్తూ సిబ్బంది విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. 600 మంది సిబ్బంది, 400 సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. ప్రతి గణపతి మండపానికి జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు వివరించారు.
News August 26, 2025
ADB: దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని హ్యాండీక్యాప్డ్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్ కోరారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ శాఖ అధికారి కలీంను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద దివ్యాంగులకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.