News August 27, 2025
ములుగు జిల్లాలో స్థానిక ఎన్నికలకు రె’ఢీ’

సెప్టెంబర్ 2 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో ఆశావాహులు పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా, ములుగు జిల్లాలో 10 మండలాలు, 171 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 1,520 వార్డులు ఉండగా, 1,535 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరగనుంది. జిల్లాలో మహిళలు 1,26,433 ఉండగా, పురుష ఓటర్లు 1,18,590 మంది ఉన్నారు.
Similar News
News August 27, 2025
VKB: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. వర్షాల కారణంగా జిల్లాలోని జలాశయాలు పూర్తిగా నిండిపోయాయని, వాగులు, కాలువలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయన్నారు. ఈ ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన కోరారు. మరో కొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
News August 27, 2025
వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలకు అలుగులు పొంగుతున్నాయి. ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌లోని నీరు నిలిచే ప్రాంతాల వద్ద జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News August 27, 2025
వరంగల్: ఆ గ్రామంలో ఒకే గణేశుడు!

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం శివాజీనగర్ గ్రామంలో 350 నుంచి 400 జనాభా ఉంటారు. వినాయక చవితి వచ్చిందంటే ఊరంతా ఒకే మాట.. ఓకే బాటగా నిలుస్తారు. రాజకీయాలకు అతీతంగా, ఐకమత్యంగా వినాయక యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఒకే వినాయకుడిని ఏర్పాటు చేసుకొని, ఒకే చోట పూజల చేస్తారు. దీంతో గ్రామ ప్రజలను పలువురు అభినందిస్తున్నారు. మీ గ్రామంలో ఎన్ని విగ్రహాలను ప్రతిష్ఠించారో కామెంట్ చేయండి.