News August 27, 2025
యూరియా వస్తుంది, రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి కొలుసు

యూరియా సరఫరా జరుగుతుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. నూజివీడులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎరువులు, ముఖ్యంగా యూరియా లభ్యతపై సీఎం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారని తెలిపారు. రైతులకు ఎటువంటి కొరత లేకుండా ఎరువులు సరఫరా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Similar News
News August 27, 2025
సికింద్రాబాద్ రైల్వే పరిసరాలు బురదమయం

HYD వ్యాప్తంగా భారీ వర్షం కురవటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు బురదమయంగా మారాయి. రహదారులపై నీరు నిల్వ ఉండడంతో పాటు, ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. వర్షంలో సామాన్లతో నడుస్తున్న వారు జారిపడి ప్రమాదానికి గురవుతున్నారు. చుట్టూరా డ్రైనేజీ సమస్యలు సైతం ఇందుకు కారణంగా అక్కడి ప్రజలు తెలిపారు.
News August 27, 2025
జగిత్యాల: గణేశ్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, పోలీసు శాఖ తరఫున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు చేపడుతున్నామని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి వినాయక మండపం నిర్వాహకులు ఆన్లైన్లో నమోదు చేసేలా అవగాహన కల్పించినట్లు వివరించారు.
మండపాల వద్ద CC కెమెరాలను ఏర్పాటు చేయాలని, రాత్రివేళల్లో మండపాల వద్ద ఉండాలన్నారు.
News August 27, 2025
VKB: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. వర్షాల కారణంగా జిల్లాలోని జలాశయాలు పూర్తిగా నిండిపోయాయని, వాగులు, కాలువలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయన్నారు. ఈ ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన కోరారు. మరో కొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.