News August 27, 2025
ఇందిరమ్మ ఇళ్లకు రూ.1,000 కోట్లు చెల్లింపు: అధికారులు

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.1,000 కోట్లు చెల్లించినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు. 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, ఇందులో 2.04 లక్షల ఇళ్ల పనులు మొదలయ్యాయని చెప్పారు. గత 3 నెలలుగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు పనులు నిర్ణీత స్థాయికి వచ్చిన 15 రోజుల్లోపే బిల్లులు రిలీజ్ అయ్యేలా చూస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News August 27, 2025
కామన్వెల్త్ గేమ్స్.. బిడ్ వేసేందుకు క్యాబినెట్ ఆమోదం

2030లో భారత్‌లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ వేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 72 దేశాలు పాల్గొననున్నాయి. భారత్ బిడ్ దక్కించుకుంటే గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గేమ్స్ జరిగే అవకాశం ఉంది. గుజరాత్‌కు గ్రాంట్ అందించేందుకు అన్ని శాఖలకు అనుమతిచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్, నైజీరియా సహా మరో రెండు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.
News August 27, 2025
రోహిత్‌కు బౌలింగ్ వేయడం కష్టం: వుడ్

తాను ఎదుర్కొన్న కష్టతరమైన బ్యాటర్ రోహిత్ శర్మ అని ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వెల్లడించారు. ‘రోహిత్ శర్మ షార్ట్ బాల్ ఆడటాన్ని ఇష్టపడతారు. అది అతనికి బలహీనత కూడా అయినప్పటికీ తనదైన రోజున బంతుల్ని బౌండరీలకు తరలిస్తారు. అతడి ఆటను చూస్తే బ్యాట్ పెద్దగా, వెడల్పుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కోహ్లీ, పంత్‌కు బౌలింగ్ చేయడం కూడా సవాలే. పంత్ అసాధారణమైన షాట్లు ఆడుతుంటారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
News August 27, 2025
భారీగా వరదలు.. నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం: కేటీఆర్

TG: భారీ వర్షాలు, వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని, ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని KTR డిమాండ్ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, వెంటనే స్పందించాలన్నారు. గతంలో KCR స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వం వైఫల్యం చెందితే BRS కార్యకర్తలు ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.