News August 27, 2025

గుంటూరులో బార్ షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు

image

గుంటూరు జిల్లాలో బార్ షాపుల కేటాయింపుకు సంబంధించి దరఖాస్తుల సమర్పణ గడువును అధికారులు మరోసారి పొడిగించారు. ఈ నెల 26 నుంచి 29 వరకు సాయంత్రం 6 గంటల లోపు ఆసక్తిగల వారు అప్లై చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ డీసీ కె.శ్రీనివాసులు మంగళవారం వెల్లడించారు. అనంతరం 30న కలెక్టర్ కార్యాలయంలో లాటరీ నిర్వహించి మొత్తం 110 షాపుల కేటాయింపును పూర్తిచేయనున్నట్లు తెలిపారు.

Similar News

News August 27, 2025

ఆయనను తిరుపతి నుంచి తరిమి కొట్టడం ఎవరి వల్ల కాదు: అంబటి

image

తిరుపతి నుంచి భూమన కరుణాకర రెడ్డిని తరిమి కొట్టడం ఎవరి వల్లా కాదని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. ‘పాపాల భైరవుడు బిఆర్ నాయుడుని మాత్రం స్వామి వారే తరిమి కొడతారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. టీటీడీ స్థలాన్ని పర్యాటక శాఖకు బదలాయించడంపై భూమన కరుణాకర రెడ్డి ఘోరమైన అపచారం జరిగిందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో అంబటి రాంబాబు ఈ విధంగా స్పందించారు.

News August 27, 2025

ఉపాధి అవకాశాలకు ఊతమిచ్చే పీఎంవీబీఆర్‌వై: డీఆర్ఎం

image

గుంటూరులో రైల్ వికాస్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో రైల్వే డీఆర్ఎం సుధేష్ణ సేన్ మాట్లాడారు. ప్రధాన మంత్రి విక్సిత్ భారత్ రోజ్ గార్ యోజన పథకం యజమానులను కొత్త ఉద్యోగులను నియమించడానికి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ పథకం కింద కేంద్రం నిర్దిష్ట కాలం వరకు ఉద్యోగులకు, యజమానులకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తుందని చెప్పారు. దీతో యజమానుల భారం తగ్గి, కొత్త ఉద్యోగావకాశాలు సృష్టించబడతాయని అన్నారు.

News August 27, 2025

GNT: ‘పంచాయతీ అభివృద్ధి సూచికతో పారదర్శకత పెరుగుతుంది’

image

గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ అభివృద్ధి సూచికపై శిక్షణా కార్యక్రమం జరిగింది. జెడ్పీ ఛైర్‌పర్సన్ హెనీ క్రిస్టీనా మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల పురోగతిని అంచనా వేసి, డేటా ఆధారిత పాలనకు ఈ సూచిక దోహదం చేస్తుందని తెలిపారు. సీఈఓ వీర్ల జ్యోతిబసు మాట్లాడుతూ.. స్థానిక స్థాయిలో 9 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై పనితీరు కొలవడంలో ఇది కీలకమని, పారదర్శకత పెరగటంతో ప్రజలకు స్పష్టత లభిస్తుందన్నారు.