News August 27, 2025

NLG: సకాలంలో అందని వేతనం.. భారంగా పోషణ

image

జిల్లాల్లోని పొరుగు సేవల ఉద్యోగులు వేతనాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోందని చెబుతున్నారు. ఉభయ జిల్లాల్లో సుమారు 7 వేల మంది పొరుగు సేవల ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తుంది. సకాలంలో వేతనాలు అందకపోవటంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News August 27, 2025

ఈనెల 29న నల్గొండలో ఉద్యోగ మేళా

image

నల్గొండ ఎస్ఎల్బీసీ డాన్ బోస్కో అకాడమీలో ఈనెల 29న ప్రఖ్యాత కంపెనీల ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ బాలశౌరిరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని టెన్త్ నుంచి పీజీ, టెక్నికల్ కోర్సులు ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత మేళాను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జెన్ ప్యాక్ట్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, హెటిరోడ్రగ్స్, మెడిప్లస్, డీమార్ట్, వరుణ్ మోటార్స్ తదితర కంపెనీలు పాల్గొంటాయని వివరించారు.

News August 27, 2025

నల్గొండ: గణనాధుడికి ఘనంగా పూజలు

image

నల్గొండ ప్రజలకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి ఆమె జిల్లా కేంద్రంలోని రామాలయంలోని మొదటి గణేశ్‌ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని, తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

News August 27, 2025

NLG: అదనపు రుణం ఎక్కడ..?

image

జిల్లాలో అదనపు రుణం అందక ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు విడతల్లో కలిసి ఇప్పటి వరకు 12,064 ఇళ్లు మంజూరయ్యాయి. ఆర్థికంగా చేయూతనివ్వడం కోసం స్వయం సహాయం సంఘాల మహిళలు లబ్ధిదారులుగా ఉంటే రూ.లక్ష అదనంగా రుణం అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ పూర్తిస్థాయిలో ఇప్పటి వరకు అమల్లోకి రావడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.