News August 27, 2025
HYD: గణపయ్య రాకకు.. గంగమ్మ స్వాగతం

HYDలో గణపయ్య రాకకు గంగమ్మ తల్లి స్వాగతం పలికింది. భక్తులు భారీగా తరలివచ్చి గణపయ్యను మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తుండగా.. వర్షం తోడవడంతో ఆ తల్లి చల్లని దీవెనలని పలువురు సంతోషం వ్యక్తంచేశారు. వర్షంలోనే డాన్సులు చేస్తూ ఘనస్వాగతం పలికారు. నిన్న సాయంత్రం నుంచి వినాయకుడి విగ్రహాల తరలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. నగరంలో ఈసారి సోలాపూర్, బాలగణపతి, మహారాజ్ రూపంలో ఉన్నవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Similar News
News August 27, 2025
పీలేరు: వినాయక చవితి వేడుకల్లో అపశృతి

పీలేరులోని బీవీ రెడ్డి కాలనీ సెంటర్లో బుధవారం వినాయక చవితి వేడుకలలో అపశృతి చోటుచేసుకుంది. గంధంతో తయారైన నాట్య వినాయకుడి మండపంలో హారతి ఇస్తుండగా బలమైన గాలికి హారతి అలంకరణ వస్త్రంపై పడి మంటలు చెలరేగాయి. దీంతో మండపం పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అప్రమత్తం కావడంతో ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు.
News August 27, 2025
సినిమా ముచ్చట్లు

* సెప్టెంబర్ 19న ‘పౌర్ణమి’ రీరిలీజ్
* ‘మిరాయ్’ ఓటీటీ పార్ట్‌నర్‌గా జియో హాట్‌స్టార్
* షారుఖ్, దీపికాలపై కేసు నమోదుకు భరత్‌పూర్ కోర్టు ఆదేశం
* ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల
* ‘ఘాటీ’ ప్రమోషన్లకు అనుష్క శెట్టి దూరం
News August 27, 2025
వరంగల్ జిల్లాలో భగ్గుమంటున్న ధరలు

జిల్లా వ్యాప్తంగా పూలు, పండ్లు, కొబ్బరికాయలు, ఇతర పూజ సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోయాయి. నేడు వినాయక చవితి పర్వదినం సందర్భంగా చామంతి పూలు కేజీ రూ.450, బంతిపూలు కిలో రూ.150 నుంచి రూ.200, మూర పూలు రూ.50కి విక్రయిస్తున్నారు. అలాగే డజను అరటి పండ్లు రూ.70-100 ధర పలుకుతున్నాయి. కొబ్బరికాయలు సైతం ఒకటి రూ.35-40 ధర ఉంది.