News August 27, 2025
ఖమ్మం: పర్యావరణ హితం.. మట్టి గణపయ్య రూపం

సత్తుపల్లిలో పలు ఉత్సవ కమిటీలు పర్యావరణానికి విఘాతం కలిగించకుండా మట్టి గణపతులను ఏర్పాటు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. స్థానిక జేవీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న ప్రసన్న గణపతి ఉత్సవ కమిటీ మనగుడి ప్రాంగణంలో 23 ఏళ్లుగా కోలకతా కళాకారులతో మట్టి గణపతిని తయారు చేయించి ప్రతిష్ఠిస్తున్నారు. అలాగే వాసవి క్లబ్, ఆరవైశ్య సంఘం ఆధ్వర్యంలో కోదండ రామాలయ ప్రాంగణంలో 14 ఏళ్లుగా మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజిస్తున్నారు.
Similar News
News August 27, 2025
కామన్వెల్త్ గేమ్స్.. బిడ్ వేసేందుకు క్యాబినెట్ ఆమోదం

2030లో భారత్‌లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ వేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 72 దేశాలు పాల్గొననున్నాయి. భారత్ బిడ్ దక్కించుకుంటే గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గేమ్స్ జరిగే అవకాశం ఉంది. గుజరాత్‌కు గ్రాంట్ అందించేందుకు అన్ని శాఖలకు అనుమతిచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్, నైజీరియా సహా మరో రెండు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.
News August 27, 2025
రోహిత్‌కు బౌలింగ్ వేయడం కష్టం: వుడ్

తాను ఎదుర్కొన్న కష్టతరమైన బ్యాటర్ రోహిత్ శర్మ అని ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వెల్లడించారు. ‘రోహిత్ శర్మ షార్ట్ బాల్ ఆడటాన్ని ఇష్టపడతారు. అది అతనికి బలహీనత కూడా అయినప్పటికీ తనదైన రోజున బంతుల్ని బౌండరీలకు తరలిస్తారు. అతడి ఆటను చూస్తే బ్యాట్ పెద్దగా, వెడల్పుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కోహ్లీ, పంత్‌కు బౌలింగ్ చేయడం కూడా సవాలే. పంత్ అసాధారణమైన షాట్లు ఆడుతుంటారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
News August 27, 2025
ఐఐటీ HYDతో మిలిటరీ అధికారుల ఒప్పందం

ఐఐటీ హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని సిమ్యులేటర్ డెవలప్‌మెంట్ డివిజన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ద్వారా సికింద్రాబాద్‌లో ఏఆర్/వీఆర్ టెక్నాలజీ నిపుణుల కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ భాగస్వామ్యం లక్ష్యం.. ఆధునిక పరిశోధనలను సైనిక అవసరాలకు అనుగుణంగా మార్చి, సైనికులకు అధునాతన శిక్షణను అందించే సాంకేతికతను అభివృద్ధి చేయడం. భవిష్యత్ మిలిటరీ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు