News August 27, 2025
HYD: చూడబోతే అడవి.. కొనబొతే కొరివి

HYD బిగ్గెస్ట్ పండుగ గణేశ్ ఉత్సవాలు షురూ అయ్యాయి. RR, మేడ్చల్, HYD జిల్లావ్యాప్తంగా పూలు, పండ్లు, ఇతర పూజ సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోయాయి. చామంతి పూలు కేజీ ₹600-800 మధ్య తూగుతోంది. బంతిపూలు కిలో రూ.150 నుంచి రూ.200 వరకు, అరటి డజన్ రూ.40- 60కి పెంచారు. బత్తాయి, యాపిల్, దానిమ్మ, జామ వంటి పూజలో ఉపయోగించే పండ్ల ధరలు రెట్టింపు చేశారు. దీంతో పండుగ వేళ కొనక తప్పదని కొనుగోలు చేస్తున్నారు.
Similar News
News August 27, 2025
ఉస్మాన్‌సాగర్ గేట్లు ఓపెన్.. సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక

భారీ వర్షాల కారణంగా ఉస్మాన్‌సాగర్ జలాశయం నిండిపోవడంతో నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు మంచిరేవుల వంతెన, నార్సింగి సర్వీస్ రోడ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. వాహనదారులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పటికీ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
News August 27, 2025
HYD: పలు రైళ్లు రీ షెడ్యూల్

సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు మరిన్ని రైళ్లను రద్దు చేస్తూ అలెర్ట్ ప్రకటించారు. కాచిగూడ నుంచి మెదక్ వెళ్లే రైలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్ 20:30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా 23:30 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. కాచిగూడ నుంచి వెళ్లే భగత్‌కి వెళ్లే రైలు 28న ఉదయం 6గంటలకు వెళ్తుందని పేర్కొన్నారు.
News August 27, 2025
HYD: పెండింగులో కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు!

HYDలో వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సుమారు 15వేలకు పైగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తమకు అందలేదని పలువురు లబ్ధిదారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందన్నారు.