News August 27, 2025

వినాయక మండపాలకు ఉచిత విద్యుత్: ఎస్ఈ

image

గణేశ్ నవరాత్రుల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ వేణుమాధవ్ తెలిపారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు విద్యుత్ కనెక్షన్ విషయంలో స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా మండపాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News August 27, 2025

కడప జిల్లాలో ఫుట్ బాల్ క్రీడకు పెరుగుతున్న ఆదరణ: ప్రదీప్

image

సీనియర్ మహిళల ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ఇటీవల ఉత్కంఠంగా ముగిసిందని కడప జిల్లా అధ్యక్షుడు ఎం. డేనియల్ ప్రదీప్ తెలిపారు. ఫైనల్‌లో కడప జిల్లా ఫుట్ బాల్ అసోషియేషన్ జుట్టు అనంతపురం జట్టుతో తలపడిందన్నారు. రెండు జట్లు మధ్య మ్యాచ్ పూర్తి సమయానికి 0-0తో డ్రాగా ముగియడంతో పెనాల్టీ షూట్ అవుట్‌కు వెళ్లింది. కీలకమైన షూట్ అవుట్‌లో అనంతపురం జిల్లా జట్టు 3-2 తేడా విజయం సాధించిందన్నారు.

News August 27, 2025

ఎగువ మానేరులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు

image

నర్మలలోని ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద పశువుల మేతకోసం వెళ్ళిన ఆరుగురిలో ఐదుగురు వరదలో చిక్కుకుపోయారు. వీరిలో ఒకరు గల్లంతు కాగా, ఐదుగురు ప్రాజెక్టు మధ్యలో చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, SP మహేష్ బి.గితే చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

News August 27, 2025

బొబ్బిలి సమీపంలో యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

రామభద్రపురం సమీపంలోని ఉన్న బొబ్బిలి స్మార్ట్ సిటీ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. బొబ్బిలి మండలం పారాదికి చెందిన పువ్వల బాలాజీ బైక్‌పై రామభద్రపురం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వినాయక చవితి రోజున మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. పారాదిలో విషాదచాయలు అలముకున్నాయి.