News August 27, 2025
NLG: సాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం

సాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం పడుతోంది. దీంతో వరుసగా గేట్లను మూసివేస్తున్నారు. 26 రేడియల్ క్రస్ట్ గేట్లకు గాను 12 క్రస్ట్ గేట్లను మూసి వేశారు. ప్రస్తుతం 14 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,61,971 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి దిగువ కృష్ణానదిలోకి స్పిల్వే మీదుగా 1,07,338 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Similar News
News August 27, 2025
కడప జిల్లాలో ఫుట్ బాల్ క్రీడకు పెరుగుతున్న ఆదరణ: ప్రదీప్

సీనియర్ మహిళల ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ఇటీవల ఉత్కంఠంగా ముగిసిందని కడప జిల్లా అధ్యక్షుడు ఎం. డేనియల్ ప్రదీప్ తెలిపారు. ఫైనల్‌లో కడప జిల్లా ఫుట్ బాల్ అసోషియేషన్ జుట్టు అనంతపురం జట్టుతో తలపడిందన్నారు. రెండు జట్లు మధ్య మ్యాచ్ పూర్తి సమయానికి 0-0తో డ్రాగా ముగియడంతో పెనాల్టీ షూట్ అవుట్‌కు వెళ్లింది. కీలకమైన షూట్ అవుట్‌లో అనంతపురం జిల్లా జట్టు 3-2 తేడా విజయం సాధించిందన్నారు.
News August 27, 2025
ఎగువ మానేరులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు

నర్మలలోని ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద పశువుల మేతకోసం వెళ్ళిన ఆరుగురిలో ఐదుగురు వరదలో చిక్కుకుపోయారు. వీరిలో ఒకరు గల్లంతు కాగా, ఐదుగురు ప్రాజెక్టు మధ్యలో చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, SP మహేష్ బి.గితే చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
News August 27, 2025
బొబ్బిలి సమీపంలో యాక్సిడెంట్.. యువకుడి మృతి

రామభద్రపురం సమీపంలోని ఉన్న బొబ్బిలి స్మార్ట్ సిటీ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. బొబ్బిలి మండలం పారాదికి చెందిన పువ్వల బాలాజీ బైక్‌పై రామభద్రపురం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వినాయక చవితి రోజున మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. పారాదిలో విషాదచాయలు అలముకున్నాయి.