News August 27, 2025

ప.గో జిల్లాకు భారీ వర్ష సూచన

image

బంగాళాఖాతంలో అల్ప పీడనం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మత్య్సకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది. వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Similar News

News August 27, 2025

రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు 18 క్రీడాకారులు ఎంపిక

image

తణుకులో మంగళవారం జరిగిన ఏపీ స్టేట్‌ ఇంటర్‌ డిస్ట్రిక్‌ అండర్‌–17 బాలుర, బాలికల ఫెన్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఎంపికల్లో 18 మంది రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పశ్చిమ గోదావరి ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ గుణ్ణం కృష్ణమోహన్ తెలిపారు. ఈ పోటీలకు జిల్లా నుంచి 60 మంది పాల్గొన్నారని చెప్పారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 30న శనివారం భీమవరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు.

News August 26, 2025

ఆచంట: వేకువజాము నుంచి చిరుజల్లులు

image

ఆచంటలోని పెనుమంచిలి, భీమలాపురం, కోడేరు, కొడమంచిలి, వల్లూరు, పెదమల్లం ప్రాంతాల్లో వేకువ జాము నుంచి చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో ఉదయం వేళ వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో రహదారులపై ఏర్పడ్డ గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా ? కామెంట్ చేయండి.

News August 26, 2025

‘తల్లికి వందనం పెండింగ్ క్లైమ్‌ల పరిష్కారానికి చర్యలు’

image

జిల్లాలో తల్లికి వందనం పెండింగ్ క్లైమ్‌ల పరిష్కారానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పలు అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తల్లికి వందనం ఖాతాలో నగదు జమ చేయడానికి ఇబ్బందిగా ఉన్న అంశాల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.