News August 27, 2025
ఏలూరు జిల్లాకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్ప పీడనం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్య్సకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది. వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Similar News
News August 27, 2025
HYD: ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో రూ.72.31కోట్లతో టెండర్లు

HYDలో 44 ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ, కొత్త వాటి ఏర్పాటుకు రూ.72.31 కోట్లతో టెండర్లు పిలవనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేసింది. నిర్ణయాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం కోసం అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. పనులపై కసరత్తు చేయాలనే సూచించినట్లు జీహెచ్ఎంసీ వివరించింది.

రాజంపేట: ముఖ్యమంత్రి పర్యటన కోసం స్థలాల పరిశీలన

రాజంపేటలో సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా అధికారులు బుధవారం రాజంపేటలో స్థలాలను పరిశీలించారు. అన్నమయ్య కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఇతర అధికారులు పలు ప్రాంతాలను పరిశీలించారు. హెలిప్యాడ్, బహిరంగ సభ, కార్యకర్తల సమావేశం కోసం అనువైన స్థలాలను పరిశీలించారు. కొత్త బోయిన పల్లె, తాళ్లపాక, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాలను వారు పరిశీలించారు.