News August 27, 2025
వధువులకు కానుకగా తుపాకులు, కత్తులు

మహిళలకు వారి వివాహ సమయంలో బంగారం, వెండి నగలకు బదులుగా ఆయుధాలు ఇవ్వాలని అఖిల భారత క్షత్రియ మహాసభ ప్రతిపాదించింది. వధువులకు కానుకగా తుపాకులు, కత్తులు ఇస్తే వారిని వారు రక్షించుకోవచ్చని అభిప్రాయపడింది. ఒకప్పుడు క్షత్రియ మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పద్ధతి తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. యూపీలోని గౌరిపూర్ మిట్లిలో జరిగిన ‘కేసరియా మహా పంచాయత్’లో ఈ తీర్మానం చేసింది.
Similar News
News August 27, 2025
వినాయకుడికి సీఎం రేవంత్ పూజలు

TG: వినాయక చవితి సందర్భంగా సీఎం రేవంత్ విఘ్నేశుడికి పూజలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన పూజలు చేశారు. వేద పండితులు సీఎం కుటుంబసభ్యులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి గీత, కుమార్తె నైమిషా రెడ్డి దంపతులు, మనవడు రేయాన్ష్ పాల్గొన్నారు.
News August 27, 2025
SHOCKING: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన రేఖ(55) 17వ బిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశమైంది. చెత్త ఏరుతూ జీవనం సాగించే కావ్రా, రేఖ దంపతులకు 16 మంది పిల్లలు పుట్టగా వారిలో ఐదుగురికి పెళ్లై పిల్లలున్నారు. తాజాగా రేఖ మరోసారి ఆస్పత్రికి వెళ్లి నాలుగో ప్రసవమని అబద్ధం చెప్పింది. తర్వాత నిజం తెలిసి వైద్యులే షాకయ్యారు. ‘మాకు ఇల్లు లేదు. పిల్లలను చదివించలేకపోయా. తిండి కోసమే రోజూ కష్టపడుతున్నా’ అని కావ్రా అన్నారు.
News August 27, 2025
సినిమా ముచ్చట్లు

* సెప్టెంబర్ 19న ‘పౌర్ణమి’ రీరిలీజ్
* ‘మిరాయ్’ ఓటీటీ పార్ట్‌నర్‌గా జియో హాట్‌స్టార్
* షారుఖ్, దీపికాలపై కేసు నమోదుకు భరత్‌పూర్ కోర్టు ఆదేశం
* ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల
* ‘ఘాటీ’ ప్రమోషన్లకు అనుష్క శెట్టి దూరం