News August 27, 2025

NGKL: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

image

గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన అధికారులు ఈ జాబితాను గ్రామపంచాయతీలలో ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30న అభ్యంతరాల స్వీకరణ, 31న తుది జాబితా విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి MBNR జిల్లాలో మొత్తం 1670 గ్రామపంచాయతీలు ఉండగా NGKL జిల్లాలో 464 గ్రామపంచాయతీలు ఉన్నాయి.

Similar News

News August 27, 2025

జనగామ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్.. కలెక్టర్ కీలక ఆదేశాలు

image

భారీ వర్షాల నేపథ్యంలో జనగామ జిల్లాకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ప్రమాద పరిస్థితులు ఉన్నా వెంటనే స్పందించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు.

News August 27, 2025

అంతర్గాం: గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్త

image

అంతర్గాం (M) శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 7 గేట్ల ద్వారా 55, 531 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. దీంతో నది పరివాహక ప్రాంతాలలో ఉన్న గ్రామాలు ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు నది వైపునకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు.

News August 27, 2025

కడపలో పండుగ రోజు విషాదం

image

కడప నగరంలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బాలాజీ నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విద్యుత్ షాక్‌కు గురై రాజారెడ్డి వీధికి చెందిన సుమ తేజ (పండు) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.