News August 27, 2025

రేపల్లె ఎక్స్‌ప్రెస్ మళ్లీ పాత షెడ్యూల్‌లోనే

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న వర్క్‌ల కారణంగా కొంతకాలంగా చర్లపల్లి వరకు మాత్రమే నడుస్తున్న రేపల్లె ఎక్స్‌ప్రెస్ మళ్లీ పూర్తి రూట్‌లోనే నడవనుంది. సెప్టెంబర్ 10 నుంచి రైలు(17645) సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12.40కు బయలుదేరి రేపల్లె చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో రైలు(17646) రేపల్లె నుంచి బయలుదేరి గుంటూరు మీదుగా సికింద్రాబాద్‌కు మధ్యాహ్నం 3.55 గంటలకు చేరుతుందని అధికారులు ప్రకటించారు.

Similar News

News August 27, 2025

అంతర్గాం: గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్త

image

అంతర్గాం (M) శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 7 గేట్ల ద్వారా 55, 531 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. దీంతో నది పరివాహక ప్రాంతాలలో ఉన్న గ్రామాలు ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు నది వైపునకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు.

News August 27, 2025

కడపలో పండుగ రోజు విషాదం

image

కడప నగరంలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బాలాజీ నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విద్యుత్ షాక్‌కు గురై రాజారెడ్డి వీధికి చెందిన సుమ తేజ (పండు) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 27, 2025

ఆసిఫాబాద్‌లో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

image

ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు గురువారం సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్ 8500844365కు సంప్రదించవచ్చని తెలిపారు.