News August 27, 2025

ఖైరతాబాద్ గణేశ్ క్యూ లైన్‌లో మహిళకు ప్రసవం

image

ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనం కోసం వెళ్లిన మహిళ ఉ.6 గంటలకు క్యూ లైన్‌లోనే ప్రసవించింది. ఆమె రాజస్థాన్‌కు చెందిన రేష్మగా గుర్తించారు. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

Similar News

News August 27, 2025

HYD: పలు రైళ్లు రీ షెడ్యూల్

image

సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు మరిన్ని రైళ్లను రద్దు చేస్తూ అలెర్ట్ ప్రకటించారు. కాచిగూడ నుంచి మెదక్ వెళ్లే రైలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్ 20:30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా 23:30 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. కాచిగూడ నుంచి వెళ్లే భగత్‌కి వెళ్లే రైలు 28న ఉదయం 6గంటలకు వెళ్తుందని పేర్కొన్నారు.

News August 27, 2025

HYD: పెండింగులో కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు!

image

HYDలో వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సుమారు 15వేలకు పైగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తమకు అందలేదని పలువురు లబ్ధిదారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందన్నారు.

News August 27, 2025

HYD: భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దు

image

భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. కాచిగూడ- కరీంనగర్ రైలు బిక్నూరు- కరీంనగర్ మధ్య, నాందేడ్-మేడ్చల్ వెళ్లే రైలు కామారెడ్డి- మేడ్చల్ మధ్య, విశాఖ- నాందేడ్ రైలు ఆకంపేట- నాందేడ్ మధ్యలో క్యాన్సిల్ చేయగా, కాచిగూడ నుంచి మన్మాడ్ వెళ్లే రైళ్లు పలు ప్రాంతాలకు డైవర్షన్ చేసినట్లు <<17535440>>షెడ్యూల్<<>> విడుదల చేశారు. కాచిగూడ- మెదక్, నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు.