News August 27, 2025
భద్రాచలంలో ఘనంగా సీతారామచంద్రస్వామి నిత్యకళ్యాణం

భద్రాచలంసీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం నిత్యకళ్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేదమంత్రాల మధ్య అర్చకులు స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Similar News
News August 27, 2025
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: KMR కలెక్టర్

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. వరదల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు నిండాయని, ప్రజలు వాటి వద్దకు వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ప్రయాణాలు మానుకోవాలని, వాగులు, వంకలు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని, చేపల వేటకు, పొలాలకు వెళ్లవద్దని కోరారు.
News August 27, 2025
ప్రకాశం: రేపే DSC వెరిఫికేషన్.. ఇవి తప్పనిసరి.!

మెగా DSC-2025 మెరిట్ జాబితా అభ్యర్థులకు DEO కిరణ్ కుమార్ బుధవారం సూచనలు చేశారు.
➤మెరిట్ జాబితా AP-DSC వెబ్‌సైట్‌లో చూసుకోవాలి.
➤రేపటి నుంచి ఒంగోలు సరస్వతి జూనియర్ కాలేజీలో వెరిఫికేషన్.
➤అభ్యర్థులు లాగిన్ ఐడీతో కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలి.
➤5 ఫొటోలు, 3సెట్ల జిరాక్సులు, ఒరిజినల్ పత్రాలు తేవాలి.
➤సూచించిన తేదీలో హాజరు కాకుంటే అభ్యర్థిత్వం రద్దు చేస్తారు.
NOTE: సందేహాలుంటే కామెంట్‌లో తెలపండి.
News August 27, 2025
HYD: భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దు

భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. కాచిగూడ- కరీంనగర్ రైలు బిక్నూరు- కరీంనగర్ మధ్య, నాందేడ్-మేడ్చల్ వెళ్లే రైలు కామారెడ్డి- మేడ్చల్ మధ్య, విశాఖ- నాందేడ్ రైలు ఆకంపేట- నాందేడ్ మధ్యలో క్యాన్సిల్ చేయగా, కాచిగూడ నుంచి మన్మాడ్ వెళ్లే రైళ్లు పలు ప్రాంతాలకు డైవర్షన్ చేసినట్లు <<17535440>>షెడ్యూల్<<>> విడుదల చేశారు. కాచిగూడ- మెదక్, నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు.