News August 27, 2025
NLG: ప్రారంభం అట్టహాసమే.. కానరాని ఎగ్ బిర్యానీ!

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఎగ్ బిర్యానీ పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. కేంద్రాలకు సరిపడా నిధులు ఇవ్వకపోవడంతో ఎగ్ బిర్యానీ అటకెక్కింది. ఈ కేంద్రాలకు ఇప్పటికే సరిపడా నిత్యావసర సరుకులు సరఫరా చేయడం లేదని.. ఎగ్ బిర్యానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతామని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News August 27, 2025
ATP: కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎస్పీ సూచనలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో కానిస్టేబుల్స్‌గా ఎంపికైన అభ్యర్థులకు విడతల వారీగా ఈ నెల 28 నుంచి 30 వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని ఎస్పీ జగదీష్ బుధవారం తెలిపారు. కావున 6, 7, 8 కౌంటర్ నంబర్ వద్ద హాజరైన అభ్యర్థులు ఈనెల 28న ఉదయం 8 గంటలకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలోని పెరేడ్ గ్రౌండ్‌కు హాజరవ్వాలని సూచించారు.
News August 27, 2025
US వస్తువులపై ఆధారపడటం తగ్గిద్దాం.. PMకి CTI లేఖ!

US 50% <<17529585>>టారిఫ్స్<<>>తో భారత్ ఎగుమతులపై ప్రభావంతో పాటు.. లక్షల ఉద్యోగాలు పోతాయని ‘ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ’ PM మోదీకి లేఖ రాసింది. లెదర్, టెక్స్‌టైల్స్, జ్యూవెలరీ, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. ట్రంప్ ఒత్తిడికి తలగ్గొద్దని, అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించాలంది. UK, జర్మనీ, మలేషియా, సింగపూర్ వంటి దేశాల మార్కెట్లను ఎక్స్‌ప్లోర్ చేయాలని సూచించింది.
News August 27, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన విశాఖ కలెక్టర్

సీఎం చంద్రబాబు ఈనెల 29న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం పరిశీలించారు. భద్రతాపరమైన అంశాలపై పోలీస్ కమిషనర్‌తో చర్చించారు. అనంతరం రుషికొండ రాడిసన్ రిసార్ట్‌ను సందర్శించి అక్కడ జరగబోయే గ్రిఫిన్ నెట్వర్కింగ్ మీటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. గ్రీన్ రూమ్, ప్రధాన సమావేశం జరిగే ప్రాంతాలను పరిశీలించారు.