News August 27, 2025
భీంపూర్‌లో అత్యధిక వర్షపాతం

గడిచిన 24 గంటల్లో జిల్లాలోని భీంపూర్ మండలంలో అత్యధికంగా 26.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జైనథ్‌లో 20.5 మి.మీ, సాత్నాలో 19.3 మి.మీ. వర్షపాతం రికార్డయింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రైతులు రెండు రోజుల పాటు పంటలకు మందులు పిచికారీ చేయకుండా ఉండాలని వ్యవసాయ అధికారులు తెలిపారు.
Similar News
News August 28, 2025
ఉట్నూర్: ఐటీఐ, ఏటీసీలలో ప్రవేశ గడువు పెంపు

ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో(ATC)ల్లో ప్రవేశానికి గడువు పెంచినట్లు ఉట్నూర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన వారికి వాక్-ఇన్ అడ్మిషన్లు ఈ నెల 28 నుంచి 30 వరకు కొనసాగుతాయన్నారు. ఈ నెల 30 మధ్యాహ్నం 1 గంట వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలన్నారు. ఏటీసీ కోర్సులతో మంచి భవిష్యత్తు ఉంటుందని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News August 28, 2025
ట్రాక్టర్ ఇసుక రూ. 400లకే : కలెక్టర్

ప్రభుత్వ పనులకు, వ్యక్తిగత పనులకు ట్రాక్టర్ ఇసుక కేవలం రూ.400 ధర మాత్రమే విక్రయించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇసుక అవసరం ఉన్నవారు భీంపూర్, బేల, జైనథ్, బోరజ్ మండల తహాశీల్దార్ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతోందన్నారు.
News August 27, 2025
సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించిన ADB ఎస్పీ

వినాయక చవితి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లు, వినాయక ప్రతిమలు తయారు చేసే ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్ పాల్గొన్నారు.