News August 27, 2025
HYDకు ఆరెంజ్ అలెర్ట్.. అనవసరంగా బయటకు వెళ్లకండి!

నగర వ్యాప్తంగా అనేక చోట్ల ఇప్పటికే వర్షం కురుస్తోంది. దాదాపు ఒంటిగంట వరకు వర్షం కొనసాగే అవకాశం ఉన్నట్లు బేగంపేట్ వాతావరణశాఖ తెలిపింది. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లితో సహా రంగారెడ్డిలోని రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాలకూ ఆరెంజ్ అలెర్ట్ ఉందని, అవసరమైతే కానీ బయటకు వెళ్లొద్దని సూచించారు.
Similar News
News August 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా వర్షపాతం నమోదు వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు బుధవారం సాయంత్రం ఇలా ఉన్నాయి. ఇల్లంతకుంట 132, గంభీరావుపేట 92.5, ఎల్లారెడ్డిపేట 40, తంగళ్ళపల్లి 31.3, సిరిసిల్ల 20.5, ముస్తాబాద్ 20, కొన్నారావుపేట 14.5, వీర్నపల్లి 11.5, రుద్రంగి 7.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇల్లంతకుంటలో ఎక్కువగా, రుద్రంగిలో తక్కువగా వర్షపాతం నమోదయింది.
News August 27, 2025
KTRపై Dy.CM భట్టి విక్రమార్క ఫైర్

TG: వరద సహాయక చర్యలపై <<17533837>>KTR<<>> అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. ‘ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. వాళ్లలాగా ఇంట్లో కూర్చోలేదు. పరిస్థితిని ఎప్పటికప్పుడు CM ఆరా తీస్తున్నారు. నిన్న బిహార్ వెళ్లి సాయంత్రానికే తిరిగొచ్చారు’ అని తెలిపారు. వరదలు వస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని KTR విమర్శించిన సంగతి తెలిసిందే.
News August 27, 2025
మిడ్ మానేరు ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద నీరు

బోయినపల్లి మండలం మిడ్ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మానేరు వాగుతో పాటు ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ద్వారా నీటి ప్రవాహం సైతం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి బుధవారం సాయంత్రం వరకు 25300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా 16365, గాయత్రి పంప్ హౌస్ నుంచి 3150, మానేరు, ములవాగు వాగు నుంచి 5785 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.