News August 27, 2025

VJA: ఒక్క క్లిక్‌తో దోచేస్తున్న సైబర్ కేటుగాళ్లు

image

అజిత్‌సింగ్‌నగర్ PS పరిధిలోని నందమూరినగర్‌కు చెందిన ఓ యువకుడు సైబర్ మోసానికి గురయ్యాడు. ఈ నెల 22న అతనికి వాట్సాప్‌లో ఒక ఈ-చలాన్ లింక్ వచ్చింది. ఆ లింక్‌ను క్లిక్ చేయడంతో అతని క్రెడిట్ కార్డు నుంచి 3 విడతల్లో మొత్తం రూ47,097, రూ.65,777 నగదు కట్ అయ్యాయి. దీంతో అతను వెంటనే తన కార్డును బ్లాక్ చేయించాడు. లింక్ క్లిక్ చేయడం వల్ల అతని ఫోన్ సైబర్ కేటుగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు.

Similar News

News August 28, 2025

రాయికల్: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

image

రాయికల్ మండలం చింతలూరు శివారులో జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో నివసించే సుద్దేవార్ వినోద్ (21) అనే యువకుడు బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్ఐ దేవేందర్ తెలిపారు. ఇంటి వద్ద ఖాళీగా ఉండడంతో ఏదైనా పని చేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్ళిన వినోద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. మృతుని తండ్రి రాములు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నానమన్నారు.

News August 28, 2025

జగిత్యాలలో పెట్రోల్ బంక్ పక్కన గుర్తుతెలియని శవం వెలుగు

image

జగిత్యాల పట్టణం కరీంనగర్ రోడ్డు వద్ద జితేందర్ రావు పెట్రోల్ బంక్ పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభించింది. నీలి, నలుపు, నారింజ రంగు చొక్కా, నలుపు ప్యాంట్ ధరించిన ఆ వ్యక్తి శవం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండగా, మున్సిపల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైనా సమాచారం ఉంటే జగిత్యాల టౌన్ పోలీసులకు 8712656815కు తెలియజేయాలని కోరారు.

News August 28, 2025

అమెరికా టారిఫ్స్.. భారత్ ప్లాన్ ఇదే!

image

అమెరికా 50% టారిఫ్స్ అమల్లోకి రావడంతో భారత్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఎగుమతులను 40 దేశాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. యూకే, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలకు డైమండ్స్, టెక్స్‌టైల్, లెదర్, సీ ఫుడ్ సహా ఇతర వస్తువులను ఎగుమతి చేయాలని భావిస్తోంది. భారత వస్తువుల క్వాలిటీ బాగుంటుందని, నమ్మకమైన ఎగుమతిదారు అని విదేశాల్లో విశ్వసనీయత ఉండటంతో దాన్ని వాడుకోవాలని యోచిస్తోంది.