News August 27, 2025

VKB‌లో పూల సాగు.. లాభాల్లో రైతులు

image

VKB జిల్లాలో రైతులు పూల సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో పూల ధరలు మెరుగ్గా ఉండటంతో పూల సాగు రైతులకు లాభాలు తెచ్చిపెడుతుంది. జిల్లా వ్యాప్తంగా 2,350 ఎకరాల్లో పూల సాగు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నవాబ్‌పేట్, మోమిన్‌పేట్, పూడూరు, VKB, మర్పల్లి, ధారూర్ తదితర మండలాల్లో పూలను విరివిగా సాగు చేస్తున్నారు. రైతులు పూలను HYDలోని పలు మార్కెట్లకు తరలించి లాభాలను ఆర్జిస్తున్నారు.

Similar News

News August 28, 2025

ఈ రోజు నమాజ్ వేళలు(ఆగస్టు 28, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.48 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.44 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.33 గంటలకు
✒ ఇష: రాత్రి 7.47 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 28, 2025

విశాఖలో జనసేన సభకు అల్లూరి పేరు

image

సేనాతో – సేనాని కార్యక్రమం సభకు అల్లూరి సీతారామ రాజు సభ ప్రాంగణంగా పేరు ఖరారు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేపటి నుంచి మూడు రోజులపాటు ఈ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ దిశ, ప్రజా సమస్యలపై చర్చలు జరగనున్నాయని అన్నారు. తేన్నేటి విశ్వనాధం, గురజాడ అప్పారావు, శ్రీ శ్రీ, కోడి రామ్మూర్తి, గుండమ్మ పేర్లు ముఖ ద్వారాలకు పెడతామన్నారు.

News August 28, 2025

మెగా లుక్స్ అదిరిపోయాయిగా..!

image

దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పినట్లుగానే మెగా ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. <<17481291>>టైటిల్<<>> గ్లింప్స్‌తో చిరంజీవి అభిమానుల ప్రశంసలు అందుకున్న ఈ డైరెక్టర్ తాజాగా పోస్టర్‌లతోనూ ఆకట్టుకుంటున్నారు. చిరు పుట్టిన రోజు రిలీజ్ చేసిన స్టైలిష్ లుక్, నిన్న పంచె కట్టులోని పోస్టర్ అదిరిపోయాయని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వింటేజ్ చిరును గుర్తు చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.