News August 27, 2025

పీలేరు: వినాయక చవితి వేడుకల్లో అపశృతి

image

పీలేరులోని బీవీ రెడ్డి కాలనీ సెంటర్లో బుధవారం వినాయక చవితి వేడుకలలో అపశృతి చోటుచేసుకుంది. గంధంతో తయారైన నాట్య వినాయకుడి మండపంలో హారతి ఇస్తుండగా బలమైన గాలికి హారతి అలంకరణ వస్త్రంపై పడి మంటలు చెలరేగాయి. దీంతో మండపం పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అప్రమత్తం కావడంతో ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు.

Similar News

News August 27, 2025

వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ డెవలప్‌మెంట్: CM రేవంత్

image

TG: HYD నగరానికి వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి జరగాలని అధికారులకు CM రేవంత్ చెప్పారు. గేట్ వే ఆఫ్ HYD, గాంధీ సరోవర్, జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధిపై సూచనలు చేశారు. సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలని, పర్యావరణ హితంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మీరాలం చెరువు, ఐకానిక్ బ్రిడ్జ్ ప్రాజెక్టుల DPR సిద్ధం చేసి పనులు మొదలెట్టాలని ఆదేశించారు.

News August 27, 2025

భద్రాద్రి: హత్యాయత్నం కేసు.. నలుగురికి జైలు శిక్ష

image

బూర్గంపాడు(M) సారపాకకు చెందిన తాళ్లూరి భారతి భర్త జగదీశ్వరరావు, మరిది సర్వేశ్వరరావులు, ఇరవెండి గ్రామంలోని తమ 3 ఎకరాల భూమి వివాదంలో అదే గ్రామానికి చెందిన నలుగురిపై దాడి చేసి హత్యాయత్నం చేశారు. ఈ కేసులో కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె.కిరణ్ కుమార్ తీర్పు ఇచ్చారు. నిందితులైన ముత్తయ్య, తులసమ్మ, గోపాలకృష్ణ, అంజలికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. 2019లో జరిగింది.

News August 27, 2025

వీధి వ్యాపారులకు లోన్లు.. కేంద్రం గుడ్ న్యూస్!

image

PM స్వనిధి పథకం గడువును కేంద్రం 2030 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ స్కీమ్ కింద వీధి వ్యాపారులకు పూచీకత్తు లేకుండా లోన్ ఇస్తారు. తొలి విడతలో ₹15 వేలు, అది చెల్లించాక రెండో విడతలో ₹25 వేలు, మూడో విడతలో ₹50,000 మంజూరు చేస్తారు. ఇప్పటివరకు తొలి విడతలో ₹10K, రెండో విడతలో ₹20K ఇచ్చేవారు. తాజాగా ఆ మొత్తాన్ని పెంచారు. లోన్ కోసం స్వనిధి పోర్టల్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో అప్లై చేయాలి.