News August 27, 2025

నయీంనగర్‌: తృణ ధాన్యాలతో బొజ్జ గణపయ్య

image

తృణ ధాన్యాలతో కలిగే లాభాలను వివరించే ఓ ప్రయత్నంలో చిన్నారి పేపర్‌పై బొజ్జగణపయ్యను రూపొందించింది. హనుమకొండలోని నయీంనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సాయిప్రకాష్ కూతురు లాస్య వినూత్నంగా తృణధాన్య బొజ్జగణపయ్యను తయారుచేసింది. పండుగలు, పర్యావరణ హితం, సంస్కృతీ, సంప్రదాయాలు తదితర అంశాలపై లాస్య తరచుగా చిత్రాలు, పెయింటింగ్ తదితర కళా ప్రదర్శనలు చేస్తోందని ఆమె తండ్రి సాయిప్రకాష్ తెలిపారు.

Similar News

News August 27, 2025

వీధి వ్యాపారులకు లోన్లు.. కేంద్రం గుడ్ న్యూస్!

image

PM స్వనిధి పథకం గడువును కేంద్రం 2030 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ స్కీమ్ కింద వీధి వ్యాపారులకు పూచీకత్తు లేకుండా లోన్ ఇస్తారు. తొలి విడతలో ₹15 వేలు, అది చెల్లించాక రెండో విడతలో ₹25 వేలు, మూడో విడతలో ₹50,000 మంజూరు చేస్తారు. ఇప్పటివరకు తొలి విడతలో ₹10K, రెండో విడతలో ₹20K ఇచ్చేవారు. తాజాగా ఆ మొత్తాన్ని పెంచారు. లోన్ కోసం స్వనిధి పోర్టల్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో అప్లై చేయాలి.

News August 27, 2025

SRSP UPDATE: 39 గేట్లు ఓపెన్

image

కురుస్తున్న వర్షాలతో SRSPకి వరద నీరు పోటెత్తడంతో బుధవారం రాత్రి 8 గంటలకు మొత్తం 39 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. ఉదయం 10 గంటలకు 8 గేట్లు, మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 39 గేట్లు, ఇతర కాలువల ద్వారా మొత్తం 1,71,048 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

News August 27, 2025

ADB: భారీ వర్షాలపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి సమీక్ష

image

వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు అప్రమత్తం చేశారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. ఎక్కడెక్కడ వర్షాలు అధికంగా కురుస్తున్నాయి, జిల్లాల్లో వరద పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.