News August 27, 2025

కర్నూలు జిల్లాలో ఉచిత విద్యకు 1,082 మంది ఎంపిక

image

కర్నూలు జిల్లాలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 12(1)సీ కింద 1,082 మంది విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్ పాల్ తెలిపారు. ఎంపికైన వారు నేటి నుంచి 31వ తేదీ వరకు కేటాయించిన పాఠశాలల్లో అడ్మిషన్ పొందాలన్నారు. సంబంధిత అధికారులు మండలాల వారీగా వివరాలను సేకరించి, నివేదికను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు.

Similar News

News August 27, 2025

8ఏళ్లు సైన్యంలో సేవలు.. DSCలో 2ఉద్యోగాలు

image

కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలోని కృష్ణదొడ్డికి చెందిన గోపాల్, పుణ్యవతి దంపతుల కుమారుడు కోదండరాముడు గత 8ఏళ్లుగా ఆర్మీలో సైనికునిగా పనిచేశారు. 2018లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఏపీ మెగా DSCలో స్కూల్ అసిస్టెంట్ సోషల్‌లో 86.07 మార్కులు సాధించారు. దీంతో జిల్లాలో 2వ ర్యాంక్, స్టేట్‌లో 13వ ర్యాంక్‌ రాగా SGTలో 87.77 మార్కులతో జిల్లా 94వ ర్యాంక్‌తో 2 ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

News August 27, 2025

ఇంటర్నేషనల్ వాలీబాల్ శిక్షణలో రాజేశ్

image

ఈనెల 23 నుంచి 27 వరకు ఇండోనేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ వాలీబాల్ లెవెల్ వన్ కోర్సుకు కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో వాలీబాల్ శిక్షకుడిగా ఉన్న రాజేశ్ అర్హత సాధించి శిక్షణ పూర్తి చేశారు. దేశం నుంచి ఎంపికైన నలుగురు శిక్షకుల్లో కర్నూలుకు చెందిన రాజేశ్ ఉండటడం విశేషం. రాజేశ్ ఎంపిక పట్ల డీఎస్డీవో భూపతి రావు, సీనియర్ క్రీడాకారులు, జిల్లా వాలీబాల్ సంఘం, జిల్లా ఒలింపిక్ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

News August 26, 2025

రూ.6.74 కోట్ల విలువైన సిటీ స్కాన్ సౌకర్యాన్ని ప్రారంభించిన మంత్రి

image

ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రూ.6.74 కోట్ల విలువైన సిటీ స్కాన్ సౌకర్యాన్ని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో పాటు సంబంధిత అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో సిటీ స్కాన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు.