News August 27, 2025

ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: నిర్మల్ ఎస్పీ

image

వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. భైంసాలోని క్యాంపు కార్యాలయంలో ఆమె హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. విగ్రహాల నిమజ్జనం వరకు ఉత్సవాలను శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News August 27, 2025

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

సూర్యాపేట: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆర్ముడ్ పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసిన గణేశ్‌ ప్రతిమ వద్ద ఎస్పీ నరసింహ, అదనపు ఎస్పీ జనార్ధన్‌ రెడ్డి పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా గణేశ్‌ ఉత్సవాల కోసం పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

News August 27, 2025

ఈ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు

image

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉండనుంది. మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. మీ జిల్లాలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.

News August 27, 2025

SRD: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

image

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ మేరకు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని ఆయా జిల్లా కలెక్టర్లకు టెలిఫోన్ ద్వారా తెలిపారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయ సహకారాలు అందించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు.