News August 27, 2025

కామారెడ్డి: వరదలో చిక్కుకున్న 9 మంది సేఫ్

image

ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అన్నసాగర్ శివారులో జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. అయితే వరద ఒక్కసారిగా ముంచెత్తడంతో పనుల్లో భాగంగా అక్కడ బిహారీ కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఇది వరకే నలుగురిని కాపాడగా, తాజాగా మరో ఐదుగురిని విపత్తు నిర్వహణ బృందాలు బృందాలు ఒడ్డుకు చేర్చాయి.

Similar News

News August 28, 2025

విశాఖలో మంత్రి లోకేశ్ పర్యటన

image

మంత్రి నారా లోకేశ్ 3 రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం గురువారం రాత్రి 8:20కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని ఎన్టీఆర్ భవన్‌లో బస చేస్తారు. శుక్ర, శనివారాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శనివారం మధ్యాహ్నం 1:45కు ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని విజయవాడ బయలుదేరి వెళ్తారు.

News August 28, 2025

వరద బాధితులను కాపాడేందుకు వైమానిక హెలికాప్టర్లు: బండి

image

కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లోని వరద బాధితులను రక్షించేందుకు వైమానిక హెలికాప్టర్లను పంపాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్‌లో మాట్లాడారు. హకీంపేటలోని డిఫెన్స్ అధికారులను ప్రత్యేక హెలికాప్టర్ పంపాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు.

News August 27, 2025

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

సూర్యాపేట: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆర్ముడ్ పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసిన గణేశ్‌ ప్రతిమ వద్ద ఎస్పీ నరసింహ, అదనపు ఎస్పీ జనార్ధన్‌ రెడ్డి పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా గణేశ్‌ ఉత్సవాల కోసం పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.