News August 27, 2025
నేడు విశాఖ-కిరండూల్ ఎక్సప్రెస్ రద్దు

కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈనెల 27న (బుధవారం) రాత్రి అరకు మీదుగా విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే విశాఖ-కిరండూల్ (18515) ఎక్సప్రెస్, అలాగే కిరండూల్ నుంచి విశాఖ బయలుదేరే (18516) ఎక్సప్రెస్ రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈరోజు విశాఖ-కిరండూల్(58501) పాసింజర్ అరకులో నిలిపేశారు. తిరుగు పయనం అరకు నుంచే విశాఖ బయలుదేరుతుందని వెల్లడించారు.
Similar News
News August 28, 2025
వరద బాధితులను కాపాడేందుకు వైమానిక హెలికాప్టర్లు: బండి

కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లోని వరద బాధితులను రక్షించేందుకు వైమానిక హెలికాప్టర్లను పంపాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్‌లో మాట్లాడారు. హకీంపేటలోని డిఫెన్స్ అధికారులను ప్రత్యేక హెలికాప్టర్ పంపాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు.
News August 27, 2025
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

సూర్యాపేట: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆర్ముడ్ పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసిన గణేశ్ ప్రతిమ వద్ద ఎస్పీ నరసింహ, అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా గణేశ్ ఉత్సవాల కోసం పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
News August 27, 2025
ఈ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉండనుంది. మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. మీ జిల్లాలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.