News August 27, 2025

దమ్ముంటే ఆ వ్యాఖ్యలు రిపీట్ చేయండి: స్టాలిన్‌కు BJP సవాల్

image

తమిళనాడు CM, DMK చీఫ్ స్టాలిన్ ఇవాళ బిహార్‌లో పర్యటించడంపై BJP ఫైరైంది. గతంలో DMK నేతలు చేసిన యాంటీ బిహార్, యాంటీ సనాతన కామెంట్స్‌ను గుర్తు చేస్తూ స్టాలిన్‌కు సవాల్ విసిరింది. ‘సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని మీ కొడుకు ఉదయనిధి గతంలో అన్నారు. బిహారీలు TNలో టాయిలెట్స్ కడుగుతారని మీ బంధువు, DMK MP దయానిధి కామెంట్ చేశారు. మీకు దమ్ముంటే వాటిని రిపీట్ చేయండి’ అని ఛాలెంజ్ చేసింది.

Similar News

News August 28, 2025

అమెరికా టారిఫ్స్.. భారత్ ప్లాన్ ఇదే!

image

అమెరికా 50% టారిఫ్స్ అమల్లోకి రావడంతో భారత్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఎగుమతులను 40 దేశాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. యూకే, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలకు డైమండ్స్, టెక్స్‌టైల్, లెదర్, సీ ఫుడ్ సహా ఇతర వస్తువులను ఎగుమతి చేయాలని భావిస్తోంది. భారత వస్తువుల క్వాలిటీ బాగుంటుందని, నమ్మకమైన ఎగుమతిదారు అని విదేశాల్లో విశ్వసనీయత ఉండటంతో దాన్ని వాడుకోవాలని యోచిస్తోంది.

News August 27, 2025

ఈ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు

image

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉండనుంది. మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. మీ జిల్లాలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.

News August 27, 2025

గోదావరి పరీవాహక ప్రజలు జాగ్రత్త!

image

TG: గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అది 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందన్నారు. మంజీరా నది వరద అంతా SRSPలోకి రానుంది. అటు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం ప్రవాహం పెరగనుంది.