News August 27, 2025
VKB: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. వర్షాల కారణంగా జిల్లాలోని జలాశయాలు పూర్తిగా నిండిపోయాయని, వాగులు, కాలువలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయన్నారు. ఈ ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన కోరారు. మరో కొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
Similar News
News August 28, 2025
ఈ రోజు నమాజ్ వేళలు(ఆగస్టు 28, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.48 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.44 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.33 గంటలకు
✒ ఇష: రాత్రి 7.47 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 28, 2025
విశాఖలో జనసేన సభకు అల్లూరి పేరు

సేనాతో – సేనాని కార్యక్రమం సభకు అల్లూరి సీతారామ రాజు సభ ప్రాంగణంగా పేరు ఖరారు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేపటి నుంచి మూడు రోజులపాటు ఈ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ దిశ, ప్రజా సమస్యలపై చర్చలు జరగనున్నాయని అన్నారు. తేన్నేటి విశ్వనాధం, గురజాడ అప్పారావు, శ్రీ శ్రీ, కోడి రామ్మూర్తి, గుండమ్మ పేర్లు ముఖ ద్వారాలకు పెడతామన్నారు.
News August 28, 2025
మెగా లుక్స్ అదిరిపోయాయిగా..!

దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పినట్లుగానే మెగా ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. <<17481291>>టైటిల్<<>> గ్లింప్స్‌తో చిరంజీవి అభిమానుల ప్రశంసలు అందుకున్న ఈ డైరెక్టర్ తాజాగా పోస్టర్‌లతోనూ ఆకట్టుకుంటున్నారు. చిరు పుట్టిన రోజు రిలీజ్ చేసిన స్టైలిష్ లుక్, నిన్న పంచె కట్టులోని పోస్టర్ అదిరిపోయాయని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వింటేజ్ చిరును గుర్తు చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.