News August 27, 2025

సికింద్రాబాద్ రైల్వే పరిసరాలు బురదమయం

image

HYD వ్యాప్తంగా భారీ వర్షం కురవటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు బురదమయంగా మారాయి. రహదారులపై నీరు నిల్వ ఉండడంతో పాటు, ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. వర్షంలో సామాన్లతో నడుస్తున్న వారు జారిపడి ప్రమాదానికి గురవుతున్నారు. చుట్టూరా డ్రైనేజీ సమస్యలు సైతం ఇందుకు కారణంగా అక్కడి ప్రజలు తెలిపారు.

Similar News

News August 28, 2025

యూఎస్ టారిఫ్స్ భారత్‌కు మేల్కొలుపు: రఘురామ్ రాజన్

image

యూఎస్ టారిఫ్స్ భారత్‌కు మేల్కొలుపు వంటిదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఫైనాన్స్ అనేవి ఇప్పుడు ఆయుధాలుగా మారుతున్నాయని ఇండియా టుడేతో చెప్పారు. అంతర్జాతీయంగా భారత్ ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. యువతకు ఉపాధిని కల్పించేందుకు, అవసరమైన వృద్ధి రేటు 8-8.5% సాధించడంలో సంస్కరణలను ఆవిష్కరించాలన్నారు.

News August 28, 2025

భారీ వర్షాలు.. పలు రైళ్ల రద్దు

image

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ కాచిగూడ-నాగర్సోల్, కాచిగూడ-కరీంనగర్, కరీంనగర్-కాచిగూడ, మెదక్-కాచిగూడ, బోధన్-కాచిగూడ, కాచిగూడ-నర్ఖేడ్, నాందేడ్-మేడ్చల్ ట్రైన్లను, రేపు నర్ఖేడ్-కాచిగూడ, నాగర్సోల్-కాచిగూడ రైళ్ల సేవలు రద్దు చేసినట్లు పేర్కొంది. పలు రైళ్లు దారి మళ్లింపు, పాక్షికంగా క్యాన్సిల్ చేసినట్లు వివరించింది.

News August 28, 2025

కొనసాగుతున్న అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇవాళ అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మన్యం, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడులో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు కదిలే అవకాశం ఉందని వివరించింది.