News August 27, 2025

రోహిత్‌కు బౌలింగ్ వేయడం కష్టం: వుడ్

image

తాను ఎదుర్కొన్న కష్టతరమైన బ్యాటర్ రోహిత్ శర్మ అని ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వెల్లడించారు. ‘రోహిత్ శర్మ షార్ట్ బాల్ ఆడటాన్ని ఇష్టపడతారు. అది అతనికి బలహీనత కూడా అయినప్పటికీ తనదైన రోజున బంతుల్ని బౌండరీలకు తరలిస్తారు. అతడి ఆటను చూస్తే బ్యాట్ పెద్దగా, వెడల్పుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కోహ్లీ, పంత్‌కు బౌలింగ్ చేయడం కూడా సవాలే. పంత్ అసాధారణమైన షాట్లు ఆడుతుంటారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Similar News

News August 28, 2025

ఈ రోజు నమాజ్ వేళలు(ఆగస్టు 28, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.48 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.44 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.33 గంటలకు
✒ ఇష: రాత్రి 7.47 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 28, 2025

మెగా లుక్స్ అదిరిపోయాయిగా..!

image

దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పినట్లుగానే మెగా ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. <<17481291>>టైటిల్<<>> గ్లింప్స్‌తో చిరంజీవి అభిమానుల ప్రశంసలు అందుకున్న ఈ డైరెక్టర్ తాజాగా పోస్టర్‌లతోనూ ఆకట్టుకుంటున్నారు. చిరు పుట్టిన రోజు రిలీజ్ చేసిన స్టైలిష్ లుక్, నిన్న పంచె కట్టులోని పోస్టర్ అదిరిపోయాయని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వింటేజ్ చిరును గుర్తు చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.

News August 28, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.