News August 27, 2025
ఆదిలాబాద్: భారీ వర్షాలు.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

రానున్న 3, 4 రోజుల పాటు ఆదిలాబాద్‌లో మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితిలో 18004251939 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. అధికారులు పూర్తి అప్రమత్తతో ఉన్నారని పేర్కొన్నారు.
Similar News
News August 27, 2025
సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించిన ADB ఎస్పీ

వినాయక చవితి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లు, వినాయక ప్రతిమలు తయారు చేసే ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్ పాల్గొన్నారు.
News August 27, 2025
భీంపూర్‌లో అత్యధిక వర్షపాతం

గడిచిన 24 గంటల్లో జిల్లాలోని భీంపూర్ మండలంలో అత్యధికంగా 26.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జైనథ్‌లో 20.5 మి.మీ, సాత్నాలో 19.3 మి.మీ. వర్షపాతం రికార్డయింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రైతులు రెండు రోజుల పాటు పంటలకు మందులు పిచికారీ చేయకుండా ఉండాలని వ్యవసాయ అధికారులు తెలిపారు.
News August 27, 2025
తాంసి : అధిక మద్యం తాగి మృతి

తాంసి మండలంలోని గొట్కూరిలో మద్యం మత్తు విషాదంగా మారింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. మడావి లక్ష్మణ్(48) సోమవారం రాత్రి స్నేహితులతో అధిక మద్యం తాగాడు. ఇంటికి వచ్చిన ఆయన అపస్మారక స్థితిలో పడిపోగా కుటుంబీకులు రిమ్స్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందడంతో ఇంటికి వచ్చారు. మంగళవారం కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.