News August 27, 2025
KMR: వరద బీభత్సం.. 60 మందిని కాపాడిన పోలీసులు

కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో సుమారు 60 మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన కామారెడ్డి పట్టణ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో సురక్షితంగా రెస్క్యూ చేసి, సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు.
Similar News
News August 27, 2025
వీధి వ్యాపారులకు లోన్లు.. కేంద్రం గుడ్ న్యూస్!

PM స్వనిధి పథకం గడువును కేంద్రం 2030 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ స్కీమ్ కింద వీధి వ్యాపారులకు పూచీకత్తు లేకుండా లోన్ ఇస్తారు. తొలి విడతలో ₹15 వేలు, అది చెల్లించాక రెండో విడతలో ₹25 వేలు, మూడో విడతలో ₹50,000 మంజూరు చేస్తారు. ఇప్పటివరకు తొలి విడతలో ₹10K, రెండో విడతలో ₹20K ఇచ్చేవారు. తాజాగా ఆ మొత్తాన్ని పెంచారు. లోన్ కోసం స్వనిధి పోర్టల్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో అప్లై చేయాలి.
News August 27, 2025
SRSP UPDATE: 39 గేట్లు ఓపెన్

కురుస్తున్న వర్షాలతో SRSPకి వరద నీరు పోటెత్తడంతో బుధవారం రాత్రి 8 గంటలకు మొత్తం 39 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. ఉదయం 10 గంటలకు 8 గేట్లు, మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 39 గేట్లు, ఇతర కాలువల ద్వారా మొత్తం 1,71,048 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
News August 27, 2025
ADB: భారీ వర్షాలపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి సమీక్ష

వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు అప్రమత్తం చేశారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. ఎక్కడెక్కడ వర్షాలు అధికంగా కురుస్తున్నాయి, జిల్లాల్లో వరద పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.