News April 2, 2024
‘లాల్ సలామ్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మార్పు?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’ సినిమా OTT రిలీజ్‌పై సందిగ్ధం నెలకొంది. OTT హక్కులను దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్.. చిత్రీకరణ సమయంలో మిస్ అయిన 21రోజుల ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేసిందట. డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ ఫుటేజీ మిస్సింగ్ విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఈనెల 12న నెట్‌ఫ్లిక్స్‌కి బదులు ‘సన్ నెక్స్ట్’లో ప్రసారం కానుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News March 16, 2026
యానాం: ఉండేది ఏపీలో.. కానీ!

పుదుచ్చేరి(UT) అసెంబ్లీ <<19389988>>ఎన్నికలకు షెడ్యూల్<<>> వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా APలోని కాకినాడ దగ్గరున్న యానాం సీటుకూ ఎలక్షన్ జరగనుంది. ఇది భౌతికంగా APలో ఉన్నా పుదుచ్చేరి పాలనా పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. 1954 వరకు ఫ్రెంచ్ పాలనలో యానాం ఉండింది. కానీ 1963లో అప్పటి ఒప్పందాల మేరకు UTగా పాండిచ్చేరి, కారైకల్, మాహేలతోపాటు విలీనమైంది. యానాం-పుదుచ్చేరి మధ్య సుమారు 780km దూరం ఉండటం గమనార్హం.
News March 16, 2026
మార్చి 16: చరిత్రలో ఈరోజు

*1764: తెలుగు భాష తొలి నిఘంటు కర్త మామిడి వెంకటార్యులు జననం
*1901: ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు జననం
*1917 ఆంధ్రప్రదేశ్ మెుదటి లోకాయుక్త ఆవుల సాంబశివరావు జననం
*1963: భారత దేశ రెండో ప్రధాన న్యాయమూర్తి ఎం.పతంజలి శాస్త్రి మరణం
*జాతీయ టీకా దినోత్సవం
News March 16, 2026
పాక్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. సిరీస్ కైవసం!

పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో 11 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలిచింది. 290 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 279 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. సల్మాన్ అఘా(106) సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయారు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 4, నహిద్ రాణా 2, ముస్తాఫిజుర్ రహ్మాన్ 3, హొస్సేన్ 1 వికెట్ తీశారు. దీంతో 3 వన్డేల సిరీస్‌ను 2-1తో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది.


