News August 27, 2025
GST రేట్స్: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడా..!

GST శ్లాబులను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని, US టారిఫ్స్ ప్రభావం పడకుండా ఎకానమీని స్థిర పరచాలని కేంద్రం భావిస్తోంది. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్న పరిస్థితి తలెత్తొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పన్నులు తగ్గేంత మేర ఉత్పత్తుల ధరలు <<17529810>>పెంచాలని<<>> బీమా, సిమెంటు సహా కొన్ని కంపెనీలు భావిస్తున్నాయని వార్తలొస్తున్నాయి. వీటిపై కేంద్రం ముందే నిఘా పెట్టాలని నిపుణులు కోరుతున్నారు.
Similar News
News August 28, 2025
సెల్యూట్ సర్(PHOTO)

TG: కామారెడ్డిలో <<17537949>>వరదలు<<>> జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పలు కాలనీలు నీట మునగగా అనేక మంది వరదలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో రంగంలో దిగిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు శ్రమించారు. భయంతో బిక్కుబిక్కుమంటున్న చిన్నారిని ఓ పోలీసు భుజాలపై సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. విపత్తులో సామాన్యులను రక్షించిన పోలీసులకు నెటిజన్లు సలాం చేస్తున్నారు.
News August 28, 2025
ప్రకాశం బ్యారేజీకి 3.8 లక్షల క్యూసెక్కుల వరద!

AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 3.8లక్షల క్యూసెక్కుల వరద ఇవాళ ఉదయం కల్లా ప్రకాశం బ్యారేజీకి చేరుతుందని అధికారులు అంచనా వేశారు. ఇది మరింత పెరగొచ్చని, మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశముందని చెప్పారు. పరీవాహక ప్రాంత ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News August 28, 2025
ఆగస్టు 28: చరిత్రలో ఈ రోజు

1934: దక్షిణ భారత దేశపు నేపథ్య గాయని ఎ.పి.కోమల జననం
1949: నటి డబ్బింగ్ జానకి జననం
1959: సినీ నటుడు సుమన్ జననం(ఫొటోలో)
1983: శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ జననం
2006: నటుడు, దర్శకుడు డి.వి.నరసరాజు మరణం