News August 27, 2025
రాజంపేట: ముఖ్యమంత్రి పర్యటన కోసం స్థలాల పరిశీలన

రాజంపేటలో సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా అధికారులు బుధవారం రాజంపేటలో స్థలాలను పరిశీలించారు. అన్నమయ్య కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఇతర అధికారులు పలు ప్రాంతాలను పరిశీలించారు. హెలిప్యాడ్, బహిరంగ సభ, కార్యకర్తల సమావేశం కోసం అనువైన స్థలాలను పరిశీలించారు. కొత్త బోయిన పల్లె, తాళ్లపాక, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాలను వారు పరిశీలించారు.
Similar News
News August 28, 2025
సెల్యూట్ సర్(PHOTO)

TG: కామారెడ్డిలో <<17537949>>వరదలు<<>> జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పలు కాలనీలు నీట మునగగా అనేక మంది వరదలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో రంగంలో దిగిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు శ్రమించారు. భయంతో బిక్కుబిక్కుమంటున్న చిన్నారిని ఓ పోలీసు భుజాలపై సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. విపత్తులో సామాన్యులను రక్షించిన పోలీసులకు నెటిజన్లు సలాం చేస్తున్నారు.
News August 28, 2025
SRD: 31 వరకు DCEB ఫీజు చెల్లించుకోవాలి: డీఈవో

ఈనెల 31 వరకు DCEB ఫీజును చెల్లించుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మండల విద్యాదికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్, SO, ZP, GOVT, MODEL, KGBV అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ పాఠశాలలు 31 వరకు చెల్లించాలని పేర్కొన్నారు. ఫీజు కట్టిన తర్వాత రిసీప్ట్, ఫిగర్ స్టేట్మెంట్, స్కూల్ రికగ్నిషన్ కాపీ, కవరింగ్ లెటర్‌లను జిల్లా విద్యాధికారి ఆఫీసులో సమర్పించాలన్నారు.
News August 28, 2025
బెల్లంపల్లి: హత్యాయత్నంలో నిందితుడి అరెస్ట్

బెల్లంపల్లిలోని దత్తాత్రేయ మెడికల్ ఎదుట ఒక వ్యక్తిపై హత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపరచిన రౌడీ షీటర్ అఖిల్ ను అరెస్ట్ చేసినట్లు CI శ్రీనివాస్ చెప్పారు. CI వివరాల ప్రకారం.. 26న అఖిల్ అనే వ్యక్తి సతీష్‌ను బండరాయితో తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలించారు. బుధవారం బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసి జ్యూడీషియల్ కస్టడికి తరలించినట్లు చెప్పారు.