News August 27, 2025

విజయవాడ: వర్షాలపై VMC అప్రమత్తం

image

భారీ వర్షాల నేపథ్యంలో VMC అప్రమత్తమైంది. నగరంలో ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి 43 మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యాన్చంద్ర తెలిపారు. డ్రైనేజీలు పొంగడం, కొండరాళ్లు జారడం, రోడ్లపై నీరు నిలవడం వంటి సమస్యల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో ఈ బృందాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. శానిటేషన్, ప్లానింగ్, ఇంజనీరింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.

Similar News

News August 28, 2025

నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇవాళ కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. అటు తెలంగాణ వర్సిటీలో ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు. మరోవైపు వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సహా మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. ఇవాళ మీకు సెలవు ఉందా?

News August 28, 2025

గ్రేటర్లో అస్తవ్యస్తంగా జలమండలి నల్ల కనెక్షన్ మీటర్లు..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లోని 14.07 లక్షల జలమండలి నల్లా కనెక్షన్లలో సగం మీటర్లు సరిగా పనిచేయడం లేదు. దీంతో వినియోగదారులకు బిల్లులు అస్తవ్యస్తంగా వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కొత్త మీటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నా, పాడైన మీటర్లు మార్చుకోవాలన్నా సరైన పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు అధికారులను కోరుతున్నారు.

News August 28, 2025

రంగారెడ్డి: ఐక్యతకు ప్రతీకగా అన్నసాగర్

image

యాలాల మండలం అన్నసాగర్ గ్రామం ఐక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ సుమారు 200 కుటుంబాలు ఏకతాటిపై పండుగలు జరుపుకుంటాయి. ప్రతి సంవత్సరం అంజనేయస్వామి ఆలయంలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఐదు రోజుల పాటు పూజలు, అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం గ్రామస్థుల మధ్య సోదరభావాన్ని పెంచుతోంది.