News August 27, 2025
ఈనెల 29న మంత్రుల సమావేశం రద్దు: కలెక్టర్

నంద్యాల జిల్లాలో మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి ఈనెల 29న కర్నూలులో నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు అయినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. మంత్రి డా.నిమ్మల రామానాయుడు, మంత్రి సత్య కుమార్ యాదవ్‌ల సమావేశం రద్దు అయిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు, ప్రజా ప్రతినిధులు గమనించాల్సిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Similar News
News August 28, 2025
గ్రేటర్లో అస్తవ్యస్తంగా జలమండలి నల్ల కనెక్షన్ మీటర్లు..!

గ్రేటర్ హైదరాబాద్‌లోని 14.07 లక్షల జలమండలి నల్లా కనెక్షన్లలో సగం మీటర్లు సరిగా పనిచేయడం లేదు. దీంతో వినియోగదారులకు బిల్లులు అస్తవ్యస్తంగా వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కొత్త మీటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నా, పాడైన మీటర్లు మార్చుకోవాలన్నా సరైన పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు అధికారులను కోరుతున్నారు.
News August 28, 2025
రంగారెడ్డి: ఐక్యతకు ప్రతీకగా అన్నసాగర్

యాలాల మండలం అన్నసాగర్ గ్రామం ఐక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ సుమారు 200 కుటుంబాలు ఏకతాటిపై పండుగలు జరుపుకుంటాయి. ప్రతి సంవత్సరం అంజనేయస్వామి ఆలయంలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఐదు రోజుల పాటు పూజలు, అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం గ్రామస్థుల మధ్య సోదరభావాన్ని పెంచుతోంది.
News August 28, 2025
వరద ప్రభావిత జిల్లాల్లో నేడు సీఎం ఏరియల్ వ్యూ

TG: భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నట్లు సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఆయా జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు, ఎస్పీలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పొంగుతున్న నదులు, వాగుల వైపు ప్రజలు వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.