News August 27, 2025
మెదక్: భారీ వర్షాలు.. రైళ్లు రద్దు

భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. కాచిగూడ- కరీంనగర్ రైలు బిక్నూరు- కరీంనగర్ మధ్య, నాందేడ్-మేడ్చల్ వెళ్లే రైలు కామారెడ్డి- మేడ్చల్ మధ్య, విశాఖ- నాందేడ్ రైలు ఆకంపేట- నాందేడ్ మధ్యలో క్యాన్సిల్ చేయగా, కాచిగూడ నుంచి మన్మాడ్ వెళ్లే రైళ్లు పలు ప్రాంతాలకు డైవర్షన్ చేసినట్లు షెడ్యూల్ విడుదల చేశారు. కాచిగూడ- మెదక్, నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు.
Similar News
News August 28, 2025
మెదక్: ఇద్దరు గల్లంతు.. వ్యక్తి మృతదేహం లభ్యం

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం రాజ్ పేట వద్ద బుధవారం వరద ప్రవాహంలో చిక్కుకున్న 10 మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది. రాజ్ పేట గ్రామానికి చెందిన మరో ఇద్దరు రాజాగౌడ్, సత్యనారాయణ గల్లంతయ్యారు. ఇందులో సత్యనారాయణ మృతదేహం లభ్యమైనట్లు గ్రామస్థులు తెలిపారు. మరో వ్యక్తి రాజాగౌడ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. రాజ్ పేటకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.
News August 28, 2025
మెదక్: నేడు ముంపు ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే

మెదక్ జిల్లాలో నీట మునిగిన ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం మెదక్ ఎస్పీ కార్యాలయంలో వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలపై సమీక్ష చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఇన్‌ఛార్జ్ మంత్రి డా.వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను హరీశ్ రావు సైతం సందర్శించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
News August 28, 2025
మెదక్: అత్యధికంగా సర్ధనలో 31 సెంమీల వర్షం

మెదక్ జిల్లా హవేలీ ఘనాపూర్ మండలం సర్ధనలో అత్యధికంగా 31 సెంమీ (316 మిమీలు) వర్షపాతం నమోదయింది. నాగపూర్‌లో 277.3 మిమీలు, చేగుంటలో 230.5 మిమీలు, రామాయంపేటలో 208, మెదక్‌లో 206 మిమీల వర్షపాతం నమోదైంది. మెదక్ ప్రాంతంలో అత్యధిక వర్షం కురవడంతో మంజీరా నది, పుష్పాల వాగు, నక్క వాగు, మహబూబ్నగర్ కెనాల్ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.