News August 27, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ

ఉమ్మడి KNR(D)లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలవారు, వాగులు, వంకల దగ్గర నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని తెలిపారు. వర్షంలో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
Similar News
News August 28, 2025
మూడు రోజులుగా ముసురు.. అయినా సాధారణ వర్షపాతమే..!

వరంగల్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా ముసురు పడుతూనే ఉంది. ఈ వానతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. అయితే మూడు రోజులుగా సాధారణ వర్షపాతమే నమోదు అవుతోంది. ఎక్కడా భారీ వర్షాలు నమోదు కాలేదు. గీసుగొండ, దుగ్గొండి, నెక్కొండ, పర్వతగిరి, రాయపర్తి, నర్సంపేట, ఖానాపూర్, నల్లబెల్లి, చెన్నరావుపేట, సంగెం, వర్ధన్నపేట తదితర మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా వరంగల్, ఖిలావరంగల్‌లో తక్కువే పడింది.
News August 28, 2025
నల్గొండలో దారుణ హత్య..?

నల్గొండలో ఓ వ్యక్తి మర్డర్ కలకలం రేపుతోంది. స్థానిక దేవరకొండ రోడ్డులో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి బాలుర జూనియర్ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. ఇవాళ ఉదయం రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడిని చింతికింద రమేష్‌గా గుర్తించారు. రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
News August 28, 2025
ADB: HYD వెళ్తున్నారా..? రూట్ మార్పు!

మీరు హైదరాబాద్ వెళ్తున్నారా అయితే ఈ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయమైనందున, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు నిర్మల్ వద్ద కొండాపూర్ బ్రిడ్జి నుంచి ఎడమవైపు డైవర్షన్ తీసుకోవాలని నిర్మల్ పోలీసులు సూచించారు. అక్కడి నుంచి మామడ, ఖానాపూర్, మెట్‌పల్లి, జగిత్యాల, కరీంనగర్ మీదుగా HYD చేరుకోవాలని కోరారు.