News August 27, 2025

అంతర్గాం: గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్త

image

అంతర్గాం (M) శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 7 గేట్ల ద్వారా 55, 531 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. దీంతో నది పరివాహక ప్రాంతాలలో ఉన్న గ్రామాలు ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు నది వైపునకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు.

Similar News

News August 28, 2025

వరంగల్: ప్రారంభమైన మార్కెట్.. పత్తి ధర ఎంతంటే..?

image

వినాయక చవితి సందర్భంగా బంద్ ఉన్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ గురువారం ప్రారంభమైంది. మంగళవారం రూ.7,600 పలికిన క్వింటా పత్తి ధర గురువారం సైతం అదే ధర పలికి స్థిరంగా ఉంది. వర్షంలో సైతం కొనుగోలు జోరుగా కొనసాగాయి. సోమవారం క్వింటా రూ.7,750 భారీ ధర పలికిన విషయం తెలిసిందే.

News August 28, 2025

డేటింగ్ యాప్స్‌లో మహిళా యూజర్లే ఎక్కువ!

image

సాధారణంగా డేటింగ్ యాప్స్‌లో పురుషులే ఎక్కువగా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ ఇండియాలోని డేటింగ్, మ్యాట్రిమోనియల్ సైట్స్, యాప్స్‌లో ఫీమేల్ యూజర్లే ఎక్కువ ఉన్నారని పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. తాజాగా ‘Knot డేటింగ్’ CEO జస్వీర్ సింగ్ ఇదే విషయం వెల్లడించారు. తమ యాప్‌లో 57% మంది సబ్‌స్క్రైబర్లు మహిళలే అని చెప్పారు. 6 నెలలకు సబ్‌స్క్రిప్షన్ ఫీ రూ.57,459 ఉన్నప్పటికీ వారు వెనుకాడటం లేదని పేర్కొన్నారు.

News August 28, 2025

తిరుగు ప్రయాణం అయిన మహారాష్ట్ర గవర్నర్

image

తిరుమల, తిరుపతి పర్యటన అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయనకు మంత్రి పి.నారాయణ, కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ వీడ్కోలు పలికారు. బొకేలు అందజేసి శాలువాతో సత్కరించారు. బీజేపీ నాయకులు, తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఉన్నారు.