News August 27, 2025

జనగామ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్.. కలెక్టర్ కీలక ఆదేశాలు

image

భారీ వర్షాల నేపథ్యంలో జనగామ జిల్లాకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ప్రమాద పరిస్థితులు ఉన్నా వెంటనే స్పందించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు.

Similar News

News August 28, 2025

భారీ వర్షాలు.. లేహ్‌లో చిక్కుకున్న మాధవన్

image

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా నటుడు మాధవన్ మరోసారి లేహ్‌లో చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 17 ఏళ్లనాటి ఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘మేము షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. గత 4రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. విమానాశ్రయాలు కూడా మూతపడ్డాయి. 2008లో త్రీ ఇడియట్స్ షూట్ కోసం వచ్చినప్పుడు కూడా ఇలాగే చిక్కుకున్నాం. అప్పుడు మంచు విపరీతంగా కురిసింది’ అని ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు.

News August 28, 2025

లింగాల మండలంలో 120.2 మిల్లీమీటర్ల వర్షపాతం

image

గడచిన 24 గంటలలో నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా లింగాల మండలంలో 120.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పెద్దకొత్తపల్లిలో 37.8, తెలకపల్లిలో 19.6, బిజినేపల్లిలో 16.2, నాగర్‌కర్నూలులో 13.2, ఊరుకొండలో 11.4, అచ్చంపేటలో 13.4, తాడూరులో 11.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

News August 28, 2025

కర్నూలులో డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం

image

డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ గురువారం కర్నూలు DEO శామ్యూల్ పాల్ అధ్యక్షతన ప్రారంభమైంది. రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియను రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ నవ్య పరిశీలించారు. కౌన్సెలింగ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.