News April 2, 2024
ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్లు

AP: అసెంబ్లీకి పోటీ పడబోయే 114 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇటీవల APCC చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు ఇందులో చోటు దక్కింది. నందికొట్కూరు నుంచి ఆర్థర్, చింతలపూడి నుంచి ఎలీజా పోటీ చేయనున్నారు. అలాగే శింగనమల నుంచి మాజీ మంత్రి శైలజానాథ్, కోడుమూరు నుంచి మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ బరిలో దిగనున్నారు.
Similar News
News April 17, 2026
రాష్ట్రంలో కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు

TG: రాష్ట్రంలో కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ద్వారా అదనంగా 416 బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 102 డయాలసిస్ సెంటర్లు ఉండగా, వాటిలో 15,600 మంది పేషంట్లు సేవలు పొందుతున్నారు. మరోవైపు 67 పాత సెంటర్లలో వెయిటింగ్ టైమ్ తగ్గించేందుకు కొత్తగా 155 మెషీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News April 17, 2026
5 మ్యాచుల్లో 0 వికెట్లు.. బుమ్రా పేలవ ప్రదర్శన

MI స్టార్ బౌలర్ బుమ్రా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తన పదునైన బౌలింగ్‌తో T20 WC గెలుపులో కీలక పాత్ర పోషించిన ఈ యార్కర్ల కింగ్ IPLలో మాత్రం తేలిపోతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. పైగా పరుగులు భారీగా సమర్పించుకుంటున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ముంబై 195 పరుగులు చేసినా ఓడిపోయింది. పరోక్షంగా ఇందుకు బుమ్రా కూడా కారణం. 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చారు.