News August 27, 2025

SRSP UPDATE: 3.50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

image

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో బుధవారం రాత్రి 10 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 39 స్పిల్వే వరద గేట్ల ద్వారా 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదిలారు. ప్రాజెక్టు దిగువన గోదావరి నదీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోచంపాడ్ ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ జగదీశ్ హెచ్చరించారు.

Similar News

News August 28, 2025

జోగులాంబ ఆలయంలో సీల్డు టెండర్ ప్రకటన

image

అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రకాల కాంట్రాక్టుల కోసం సీల్డు టెండర్లను ఆహ్వానిస్తున్నారు. టెండర్లు దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 1 2025 సాయంత్రం 5 గంటలు వరకు ఉంటుంది. పూర్తి వివరాల కోసం దేవస్థానం వెబ్‌సైట్ లేదా కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

News August 28, 2025

గద్వాల్: కాంగ్రెస్‌ నుంచి BRSలోకి బీఎస్ కేశవ్

image

గద్వాల మాజీ మున్సిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం జిల్లా కేంద్రంలో కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు భరోసా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో గుడ్ న్యూస్ ఏదీ లేదని విమర్శించారు. అనంతరం BRS చేరుతున్నట్లు తెలిపారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News August 28, 2025

లాంగ్ గ్యాప్ తర్వాత RCB ట్వీట్.. ఏమందంటే?

image

దాదాపు 3 నెలల తర్వాత RCB Xలోకి రీఎంట్రీ ఇచ్చింది. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పెషల్ లెటర్ పోస్ట్ చేసింది. ‘సైలెన్స్ ఆబ్సెన్స్ కాదు.. బాధ. JUN 4th అంతా మార్చేసింది. హృదయాల్ని ముక్కలు చేసింది. ఈ సమయంలో ‘RCB CARES’కి ప్రాణం పోశాం. ఫ్యాన్స్‌కు అండగా నిలిచేందుకు ఈ ప్లాట్‌ఫామ్ తోడ్పడుతుంది. మేం తిరిగొచ్చింది సెలబ్రేషన్‌తో కాదు.. మీతో కలిసి నడవడానికి. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అని పేర్కొంది.