News August 27, 2025
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

సూర్యాపేట: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆర్ముడ్ పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసిన గణేశ్ ప్రతిమ వద్ద ఎస్పీ నరసింహ, అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా గణేశ్ ఉత్సవాల కోసం పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
Similar News
News August 28, 2025
సంగారెడ్డి: జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాను ఆరెంజ్ అలర్ట్‌గా వాతావరణ శాఖ ప్రకటించినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దని అన్నారు. ప్రజలు వాగులు, చెరువులు, కుంటల దగ్గరికి వెళ్లకూడదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.
News August 28, 2025
విజయవాడ: మేనేజర్ జాబ్స్.. రూ. 40 వేల జీతం

విజయవాడలోని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన జిల్లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT) మేనేజర్ ఉద్యోగాల(6) భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత కోర్సులలో బీటెక్, పీజీ చేసి మూడేళ్ల అనుభవమున్న అభ్యర్థులు SEPT 6లోపు https://apts.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల వేతనం ఇస్తామని, వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడాలన్నారు.
News August 28, 2025
నేడు బాపట్ల జిల్లాకు భారీ వర్ష సూచన.!

ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని APSDMA బుధవారం ‘X’ వేదికగా వెల్లడించింది. దీని ప్రభావంతో గురువారం బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40-60 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.