News August 28, 2025

వరద బాధితులను కాపాడేందుకు వైమానిక హెలికాప్టర్లు: బండి

image

కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లోని వరద బాధితులను రక్షించేందుకు వైమానిక హెలికాప్టర్లను పంపాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్‌లో మాట్లాడారు. హకీంపేటలోని డిఫెన్స్ అధికారులను ప్రత్యేక హెలికాప్టర్ పంపాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు.

Similar News

News August 28, 2025

విజయవాడ: మేనేజర్ జాబ్స్.. రూ. 40 వేల జీతం

image

విజయవాడలోని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన జిల్లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT) మేనేజర్ ఉద్యోగాల(6) భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత కోర్సులలో బీటెక్, పీజీ చేసి మూడేళ్ల అనుభవమున్న అభ్యర్థులు SEPT 6లోపు https://apts.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల వేతనం ఇస్తామని, వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్‌ చూడాలన్నారు.

News August 28, 2025

నేడు బాపట్ల జిల్లాకు భారీ వర్ష సూచన.!

image

ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని APSDMA బుధవారం ‘X’ వేదికగా వెల్లడించింది. దీని ప్రభావంతో గురువారం బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40-60 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News August 28, 2025

వ్యవసాయ కుటుంబంలో మెరిసిన విద్యా కుసుమం

image

డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో దేవనకొండ మండలం కొత్తపేటకి చెందిన పీరా సాహెబ్, షాజిదాబీ దంపతుల కూతురు మస్తాన్ బి సత్తా చాటారు. తల్లిదండ్రులు పొలం పనులు చేస్తూ కూతురు ఉన్నత శిఖరాలను చూడాలని ఎన్నో కలలు కన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చదివించారు. మస్తాన్ బి డీఎస్సీ ఫలితాలలో 77.88 మార్కులు సాధించి ఎస్‌జిటి పోస్ట్‌కు ఎంపికైంది. తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.